MBNR – జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా డిసెంబర్ 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి టి.రఘురాం తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా డిసెంబర్ 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి టి.రఘురాం తెలిపారు.
భారత రాజ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కోర్ట్ న్యాయ సేవ సదన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కోర్టుతో పాటు, జిల్లాలోని అన్ని తాలూకా కోర్ట్ లలో కూడా మెగా లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు వారికి సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఎం ఐ యాక్ట్, లేబర్, ఎంప్లాయిమెంట్ వివాదాలు,ఫామిలీ,సివిల్ కేసులు, మనీ రికవరీ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, కాంపౌండ్ కేసులు, ఇతర పరిష్కరించుకో దగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా అదాలత్ కు రావడం వల్ల కోర్టు ఫీజు ఉండదని, అంతేకాక లోక్ అదాలత్ ద్వారా తుది తీర్పు ఇవ్వడం జరుగుతుందని, అప్పీలు ఉండదని, సాధ్యమైనంత ఎక్కువ కేసులు పరిష్కరించుకోవచ్చని, ప్రజలు, న్యాయవాదులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువమంది సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని ఆయన కోరారు. ఫ్యామిలీ వివాదాలు, సివిల్ ,రాజీపడే క్రిమినల్ వివాదలు కూడా జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని,ఇందుకు అన్ని తాలూకా కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. పూర్తి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు .
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకటరామన్, సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సంధ్యారాణి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీదేవి,జ్యుడీషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కిరణ్ కుమార్, ఎక్సైజ్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Share This Post