MBNR – జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు అందరూ సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు పిలుపునిచ్చారు.

జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు అందరూ సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు పిలుపునిచ్చారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అంతకుముందు జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విషయంలో జిల్లా అధికారులు అందరూ సమిష్టిగా కృషిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ- ఆఫీస్ పై సమీక్షిస్తూ జిల్లా అధికారులందరు ఈ- ఆఫీసును విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఆలాగే అన్ని తాహసిల్దార్, ఎం పి డి ఓ కార్యాలయాలలో కూడా ఈ- ఆఫీస్ విధానాన్ని నూటికి నూరు శాతం అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే మరోసారి మండల స్థాయి అధికారులకు ఈ- ఆఫీస్ నిర్వహణ పై శిక్షణ ఇవ్వాలని జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి మూర్తి కి సూచించారు.
ఉపాధి హామీ పథకం కింద లేబర్ రిపోర్టు పెంచాలని, జాప్యం లేకుండా ఎఫ్ టి ఓ జెనరేట్ చేయడంతోపాటు, ఆన్లైన్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు చేయాలని, జాబ్ కార్డు లేని వారందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధరణి ప్రత్యేక ప్రజావానికి హాజరై అక్కడ కూడా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావులు ప్రజావాణి, వ్యాక్సినేషన్ ,పల్లె ప్రగతి, బృహత్తర పల్లె ప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ,కురుమూర్తి జాతర తదితర అంశాలపై జిల్లా , మండల అధికారులతో సమీక్షించారు.
కాగా సోమవారం ప్రజావాణికి 47 ఫిర్యాదులు రాగా,ధరనికి 41 ఫిర్యాదులు వచ్చాయి.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Post