MBNR – జీవితాంతం ఎన్నో సేవాలందించి వయో వృద్ధులైన వారికోసం చేతనైనంత సేవ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, , క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

@ప్రభుత్వం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం

@ ఎలాంటి ఆధారం లేని వయోవృద్ధులకు ఇంటివద్దకే భోజనం

@సీనియర్ సిటిజన్ల కోసం మండలాల వారీగా కమిటీలు

@వృద్ధుల కోసం ప్రత్యేక అధికారి నియామకం

జీవితాంతం ఎన్నో సేవాలందించి వయో వృద్ధులైన వారికోసం చేతనైనంత సేవ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, , క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ లోని రెవెన్యూ మీటింగ్ హాల్ లో మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వయోవృద్ధులకు మంత్రి సన్మానం చేశారు.
కే గంగయ్య అనే సీనియర్ సిటిజన్ ను మంత్రి సన్మానించి పాదాభివందనం చేశారు.

జీవితకాలం పిల్లలు, సమాజం కోసం ఎంతో సేవ చేసిన వయోవృద్ధులకు తిరిగి మనం ఎంత చేసినా తక్కువేనని మంత్రి తెలిపారు. వయోవృద్ధుల కోసం పట్టణానికి సమీపంలోనే సుమారు రెండు ఎకరాల స్థలంలో ప్రభుత్వం త్వరలోనే వృద్ధాశ్రమం నిర్మించబోతుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. వృద్ధాశ్రమం పక్కనే అనాధ శరణాలయం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు అడిగిన వెంటనే మంజూరి చేయించి వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. టీ -హద్వారా ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ లకు ధీటుగా 64 రకాల వైద్య పరీక్షల ను ఉచితంగా అందిస్తున్నామని, ఈ సౌకర్యాన్ని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గురువారం వయవృద్ధుల కోసమే ప్రత్యేకంగా పీహెచ్సీలలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఒకప్పుడు జిల్లాలో తాగునీరు కూడా లేక వయోవృద్ధులు ఎంతో ఇబ్బందులు పడేవారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిత్యం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. నెక్లెస్ రోడ్డు, ఐలాండ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, మహబూబ్ నగర్ లో శిల్పారామం వంటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత వయోవృద్ధులు సేద తీరేందుకు చక్కని అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు.

సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం మండలాల వారిగా కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆదెరువు లేని, అవసరమైన వారికి శాంతనారాయణ గౌడ్ ట్రస్ట్ ద్వారా ఇంటికి భోజనం పంపించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొడుకుల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్న వృద్ధులకు అవసరమైన సాయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక లైజనింగ్ అధికారిని నియమించినట్లు మంత్రి తెలిపారు. నాగరాజు 9440662543 నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ సీనియర్ సిటిజెన్లకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయని, అందులో 2007 సీనియర్ సిటిజన్ ఆక్ట్ ను జిల్లాలో తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వయోవృద్ధుల కోసం వైద్య సేవలు అందించేందుకు ఆదేశించడం జరిగిందని, ఒకవేళ ఎక్కడైనా సేవలు అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వయో వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, ఇంచార్జ్డి డబ్ల్యు ఓ రాజేశ్వరి, రెడ్ క్రాస్ ట్రెజరర్ జగపతి రావ్ ,వయో వృద్ధుల జిల్లా కమిటీ కార్యదర్శి నాగభూషణం,పాండురంగం,తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post