MBNR – టి ఎస్ బి పాస్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు

టి ఎస్ బి పాస్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.
శుక్రవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో టి ఎస్ బి పాస్ చట్టంపై సమీక్ష నిర్వహించారు.
టీఎస్ బిపాస్ చట్టం ప్రకారం భవనాల అనుమతులు,నిర్మాణాలు,లే అవుట్లు ఉండాలన్నారు.టి ఎస్ బి పాస్ కింద వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అదేవిధంగా ఫిర్యాదుల పై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలలో ఒకటని,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మార్గ నిర్దేశంలో పట్టణంలో చేపట్టిన రహదారుల విస్తరణ ,సెంట్రల్ మీడియన్, లైటింగ్, ప్లాంటేషన్,జంక్షన్ల అభివృద్ధి,భవిష్యత్తు లో మహబూబ్ నగర్ ఎలా ఉండాలో దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలన్నారు. ఇదే తరహాలోనే జడ్చర్ల,భూత్పూర్ మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలన్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాలలో కూడా టి ఎస్ బి పాస్ చట్టం ప్రకారం భవనాల నిర్మాణాలు,లే అవుట్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, అలాగే ఇరిగేషన్ చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్డిఓ పద్మశ్రీ ,మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్ ,సునీత, నూరుల్ నజీబ్, ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

Share This Post