MBNR – టీఎస్- ఐపాస్ కింద పరిశ్రమల స్థాపన కై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్దేశించిన సమయంలో అనుమతులివ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు.

టీఎస్- ఐపాస్ కింద పరిశ్రమల స్థాపన కై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్దేశించిన సమయంలో అనుమతులివ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టి ఎస్- ఐ పాస్ ,టీ-ప్రైడ్ సమావేశంలో ఈ రెండు అంశాల పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
పరిశ్రమల స్థాపనకు గాను 247 దరఖాస్తులు రాగా, 186 అనుమతులు ఇవ్వడం జరిగిందని ,మరో 28 వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురికాగా, తక్కినవి ప్రాసెస్ లో ఉన్నట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాసెస్ లో ఉన్న దరఖాస్తుల ను పరిశీలించి సకాలంలో అనుమతి ఇవ్వాలని, అంతేకాక ఇకపై పరిశ్రమలకు వచ్చే దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉంచుకోకుండా ఎప్పుటికప్పుడే అనుమతి ఇవ్వాలని చెప్పారు.
ట్- ప్రయిడ్ కింద వాహనాల కొనుగోలు నిమిత్తం షెడ్యూల్ కులాల వారు 17, షెడ్యూల్డ్ తెగల వారు 66 దరఖాస్తులు చేసుకోగా, వీటిని క్షున్నంగా పరిశీలించి దళిత బంధు ,ఇతర పథకాల కింద ఇదివరకే లబ్ధి పొందిన వారి వివరాలను పరిశీలించి అనుమతులు ఇవ్వాలని సూచించారు.
జిల్లా పరిశ్రమల మేనేజర్ బాబురావు, ఎల్డీఎం భాస్కర్ ,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post