@ట్యాంక్ బండ్ పూడికతీత పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు .
సోమవారం సాయంత్రం అయన ట్యాంక్ బండ్ పూడికతీత పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ బండ్ లో రామయ్య బౌలి వైపునుండి చేపట్టిన పూడికతీత పనులు, అలాగే స్టేడియం వెనుక వైపున చేపట్టిన పూడికతీత పనులు, బండు విస్తీర్ణం, రోడ్డు పనులను పరిశీలించారు. పనుల వేగవంతానికి అవసరమైతే మరింత మిషనరీ, మనుషులను ఏర్పాటు చేయాలని చెప్పారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,ఈ ఈ చక్రపాణి ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డి ఈ మనోహర్ తదితరులు ఉన్నారు.