MBNR – డెంగ్యూ ,మలేరియా కేసులు నమోదు కాకుండా ఈ శనివారం నుండి వచ్చే శనివారం వరకు డ్రై డే తో పాటు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

@డెంగ్యూ ,మలేరియా కేసులు నమోదు కాకుండా ఈ శనివారం నుండి వచ్చే శనివారం వరకు డ్రై డే తో పాటు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి.
@నీటి గుంతలు లేకుండా చూడాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.
గురువారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల పై వైద్యాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓ లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
@ ఇకపై జిల్లాలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కారాదు
@గ్రామాలు, పట్టణాలలో పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
@ మున్సిపల్ కమిషనర్లు కౌన్సిలర్ లతో శనివారం సమావేశం నిర్వహించాలి @గ్రామాలలో కూడా సమావేశాలు నిర్వహించాలి
@ఇంటింటికి తిరిగి డ్రై డే నిర్వహించాలి @ సెప్టెంబర్ 30 వరకు ప్రతిరోజు నిర్వహించాలి
@ గ్రామాలలో వాన నీటి గుంతలు ఉండరాదు
@ఎక్కడైనా మురికి నీటి గుంటలు ఉంటే గంబుషియా చేపలు వదలాలి
@ డ్రై డే నిర్వహణలో ప్రజాప్రతినిధులను కూడ పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలి
@ అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి
@ప్రతి మండలంలో కనీసం 10 వేల ఆయిల్ బాల్స్ వేయాలి
@ప్రతి రోజు గ్రామాలలో ఫాగింగ్ చేయాలి
@అన్ని గ్రామాలు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయండి
@ పాలిథిన్ కవర్లను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపండి
@ బహిరంగ ప్లాట్లలో చెత్త లేకుండా యజమానులకు నోటీసులు జారీ చేయండి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ, డిపి ఓ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

Share This Post