MBNR – తమ ప్రభుత్వం అన్ని మతాలు, కులాల సంక్షేమానికి పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .

తమ ప్రభుత్వం అన్ని మతాలు, కులాల సంక్షేమానికి పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నేషనల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా నుండి హజ్ యాత్ర కు వెళుతున్న సుమారు 75 మంది ముస్లిం లకు వాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు .
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో ముస్లిం మైనార్టీల సంక్షేమలో భాగంగా హజ్ హాల్ నిర్మాణం కోసం 4 ఏళ్ల క్రితం 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే హజ్ హాలు నిర్మాణాన్ని చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆయన ముస్లిం మత పెద్దలతో పాటు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందనితెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మతకలహాలు, గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని దీనిని ప్రజలు గమనించాలని కోరారు. గతంలో ప్రజలు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న రని, ముఖ్యంగా తాగునీటికి, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉండేవని,ఇప్పుడు అలాంటి సమస్యలనేవి లేవని ప్రజలు వీటన్నిటిని గమనించాలని అన్నారు. ప్రతి పేదవారికి సహాయం చేయడమే తమ ఉద్దేశమని, తెలంగాణ మరింత అభివృద్ధి కావాలని, అంతేకాక పేదరికం పోవాలని ఆయన ఆకాంక్షించారు.హజ్ యాత్ర క్షేమంగా పూర్తిచేసుకుని రావాలని కోరారు.
మున్సిపల్ చైర్మన్ కె. సి. నరసింహులు ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ రెహమాన్, హజ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహమూద్, రాష్ట్ర కమిటీ మాజీ చైర్మన్ కలీల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ ,మహమ్మద్ రఫీ, సభ్యులు షేక్ అజార్,తదితరులు ఉన్నారు.

 

 

 

Share This Post