MBNR – తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 17 న మహబూబ్ నగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.

@తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 17 న మహబూబ్ నగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
@ ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,స్థానిక సంస్థలు,గ్రామ పంచాయతీలలో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాస్వామ్య ప్రభుత్వం కిందికి రావడం గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించిందని ఈ మేరకు మంగళవారం జీవో ఆర్టీ నెంబర్ 17 43ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటన తెలిపారు . ఈ 75 సంవత్సరాల గుర్తుగా ఈనెల 16 నుండి 18 వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని జీవోలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు .ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న రాష్ట్ర రాజధానిలోని పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, జిల్లా కేంద్రాలలో సంబంధిత మంత్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని తెలిపారు.
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
అంతేకాక అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ,స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
సెప్టెంబర్ 16న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 11 గంటలకు విద్యార్థులు, యువత, మహిళా గ్రూపులతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ సందర్భంగా తెలంగాణ సమరయోధులు, కళాకారులను సన్మానించాలని జీవోలో ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Share This Post