MBNR – తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో ప్రజలు తాగునీరు, విద్యుత్తు వంటి వాటికి ఎన్నో రకాల బాధలను అనుభవించారని తెలిపారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి కింద ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు అవార్డులను ప్రధానం చేశారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతకుముందు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి ఇంటికి నల్ల, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, వైకుంఠ దామాలు, రైతు వేదికలు ఎన్నో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.బ్రతుకు తెరువుకోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఇప్పుడు తిరిగి వస్తున్నారని, ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా బ్రతుకుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు . పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని అన్నారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారంలో సర్పంచులు ముందుండాలని కోరారు. అంతేకాక ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకున్న గ్రామాలకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు సూచించారు.
మొదటి ఉత్తమ గ్రామ పంచాయతీలకు 15 వేల రూపాయలు, రెండవ ఉత్తమ గ్రామ పంచాయతీలకు పదివేలు, మూడవ ఉత్తమ గ్రామ పంచాయతీలకు 5,000 చొప్పున మంత్రి చెక్కులను అందజేశారు.
అంతేకాక ఓడిఎఫ్ ప్లస్ సాధించిన 12 గ్రామపంచాయతీలకు అవార్డులను ప్రదానం చేశారు.

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎంపీపీ ,జడ్పిటిసి జెడ్పీ సీఈవో జ్యోతి, డిఆర్డిఓ యాదయ్య,డి పి ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు .
పల్లె ప్రగతి లో భాగంగా మండలాల వారీగా చేపట్టిన కార్యక్రమాల పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించి తిలకించారు .

Share This Post