MBNR – దళితుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.

View Post

దళితుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు,సూచనల మేరకు దళిత బంద్ యూనిట్ల గ్రౌండింగ్ ను వేగవంతం చేయడంతో పాటు,జిల్లాలో దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించరేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ,ఇందులో భాగంగానే దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో దళిత సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఆయన దళితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అనేక మంది దళితులు , దివ్యాంగులు వారి సమస్యల పరిష్కారానికి క్యూలో నిలబడి విన్నవించేందుకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో వారి సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రత్యేకించి ఒక రోజు ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం దళిత సమస్యలపై ప్రజావాణి నిర్వహిస్తుండగా ఈ నెల 12న దివ్యాంగుల సమస్యలపై ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మొదటిసారి నిర్వహించిన దళిత ప్రజావాణికి అనేకమంది షెడ్యూల్ కులాల వారు వారి సమస్యల పరిష్కారానికి స్వయంగా రెవెన్యూ సమావేశ మందిరానికి వచ్చి జిల్లా కలెక్టర్ కు వారి ఫిర్యాదులను సమర్పించారు.
వీటిలో గతంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల సమస్యలు, ఇండ్ల స్థలాలు,ఎస్ సి ల అభివృద్ధి కి ఇచ్చిన భూములకు సంబంధించి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు, లక్ష్మీ నగర్ కాలనీలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణం ,మూడెకరాల భూమి మంజూరు ,విద్యుత్ బిల్లుల మాఫీ వంటి అంశాలపై కెవిపిఎస్ కురుమయ్య, యాదయ్య,రేణుక,కొప్పుల శ్రీనివాస్,పాపగల్ వేణుగోపాల్ తదితరులు ఫిర్యాదులను సమర్పించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు .
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్ డి ఓ పద్మశ్రీ, కలెక్టరేట్ ఏ ఓ కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, సోషల్ వెల్ఫేర్ డిడి యాదయ్య తదితరులు హాజరయ్యారు.

 

 

 

Share This Post