MBNR – దళిత బందు కింద 2022- 23 ఆర్థిక సంవత్సరానికి కొత్త యూనిట్లు ఏర్పాటు.

@ దళిత బందు కింద 2022- 23 ఆర్థిక సంవత్సరానికి కొత్త యూనిట్లు ఏర్పాటు చేసే విషయమై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో డిక్కీ(దలిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ &ఇండస్ట్రీ) సహకారంతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.
శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన డిక్కీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు కింద ఎప్పటిలా ఒకే రకమైన యూనిట్లకన్న భిన్నమైన యూనిట్ల ఏర్పాటుకు ఆలోచించాలన్నారు. ఇందుకు డిక్కీ ప్రతినిధులు శంకర్ బాబు, వెంకటయ్య సుముఖం వ్యక్తం చేశారు.
జిల్లాలో దళిత బంధు కింద సెంట్రింగ్, డైరీ ,పౌల్ట్రీ ,ఇటుకల తయారీ, హార్డ్వేర్, పెయింటింగ్ ,జిరాక్స్ ,డిజీపీఎస్ వంటి ఎన్నో రకాల యూనిట్లను ఏర్పాటు చేశామని, అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇవే కాకుండా కొత్తవి ఏర్పాటు చేసేందుకు డిక్కీ సహకారం అందించాలని, ఇందుకుగాను జిల్లా స్థాయిలో ఒక అవగాహన సదస్సు ను నిర్వహించి జిల్లాలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో డిక్కీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కాగా డిక్కీ దళిత బంధు కింద సుమారు 1000 ప్రాజెక్టులు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంది.
ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదయ్య గౌడ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్, దళిత ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ &ఇండస్ట్రీ మహబూబ్ నగర్ జిల్లా కో-ఆర్డినేటర్ డి. శంకర్ బాబు ,జోనల్ కో-ఆర్డినేటర్ బి. వెంకటయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు .

 

Share This Post