MBNR – దళిత సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

@ దళిత సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
జిల్లాలోని దళితుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 6న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:00 వరకు షెడ్యూల్ కులాల వారి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 12న ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమాలకు తనతో పాటు, అదనపు కలెక్టర్లు, ఆర్ డి ఓ , జిల్లా సంక్షేమ అధికారి ,డి ఆర్ డి ఓ , డిఆర్ఓ, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పాల్గొంటారని తెలిపారు.
అదేవిధంగా మండల స్థాయి నుండి తహసిల్దార్లు, ఎంపీడీవోలు వెబ్ ఎక్స్ ద్వారా ఈ ప్రజా వాణికి హాజరవుతారని తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాలకు జిల్లాలోని షెడ్యూల్ కులాల వారు ,దివ్యాంగులు హాజరై వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

Share This Post