MBNR – దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 7.80 లక్షల రూపాయల విలువ చేసే బ్యాటరీ స్కూటీ లను,బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమ లో భాగంగా ఉద్యోగాలలో రిజర్వేషన్ లతోపాటు, చదువులలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, అంతేగాక బ్యాంకుల ద్వారా దివ్యాంగులకు రుణాలను ఇవ్వడం తో పాటు, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి కాళ్లపై వారు నిలబడేలా జీవితంలో ముందుకు సాగేందుకు గాను సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద మహబూబ్ నగర్ జిల్లాలోని దివ్యాంగులకు ఒక్కొక్కటి లక్ష రూపాయల విలువ చేసే 6 బ్యాటరీ స్కూటీ లు, ఒక్కొక్కటి 45 వేల రూపాయల విలువ చేసే 4 బ్యాటరీ ట్రై సైకిల్ల ను పంపిణీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు,పి ఏ సి ఎస్ అధ్యక్ష్యులు కొరమోని వెంకటయ్య, జిల్లా మహిళా ,శిశు సంక్షేమ,దివ్యాంగుల శాఖ అధికారిని రాజేశ్వరి ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

 

Share This Post