MBNR – దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి @దివ్యాంగుల సమస్యలు తీర్చడానికి కట్టుబడి ఉన్నాం – జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు.

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇకపై ప్రతి నెల చివరి బుధవారం ఈ కార్యక్రమం ఉంటుందని, ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రత్యేకంగా దివ్యాంగుల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తామని, ఒకవేళ తమ పరిధిలో లేని వాటిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు .
జిల్లాలో ఖాళీగా ఉన్న 25 వికలాంగుల పోస్టులను భర్తీ చేశామని, ఇకపై కూడా ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామన్నారు. ప్రైవేటు సంస్థలలో దివ్యాంగులకు రిజర్వేషన్ పాటించే విషయమై ఇండస్ట్రీయల్ అధికారులతో మాట్లాడి ఇచ్చేలా కృషి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
దివ్యాంగులు మామూలు వారి కన్నా సమర్థవంతంగా పని చేయగలరని నిరూపించారని ,అందువల్ల ఆత్మన్యూనతా భావంతో ఉండకుండా ముందుకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆడిటోరియం కావాలని దివ్యాంగులు విజ్ఞప్తి చేయగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఇదివరకే ఉన్న ప్రభుత్వ భవనం లో సమావేశాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
సదరం క్యాంపు లను సీనియర్ అధికారులతో పాటు,రెండవ స్థాయి అధికారులు కూడా హాజరై తనిఖీ చేస్తారని ఆయన వెల్లడించారు. దివ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లో మధ్య దళారులను నమ్మవద్దని, ఎవరైనా తప్పుడు సదరం సర్టిఫికెట్ తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంగన్వాడీ పోస్టుల భర్తీలో వికలాంగులకు వయస్సు మినహాయింపు విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వికలాంగుల సమస్యలను తీర్చడంలో ఎప్పటికీ కట్టుబడి ఉంటామని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి,డి ఆర్ డి ఓ యాదయ్య ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post