MBNR – దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో, సంస్థానాల విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో, సంస్థానాల విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచేందుకు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువ లేనిదన్నారు. అలాగే భారత హోమ్ శాఖా మంత్రిగా దేశంలోని సంస్థానాలన్నింటిని విలినీకరణం చేయటంలో ఆయన చూపిన తెగువ, నిర్ణయం ఆదర్శనీయమన్నారు. దేశ ప్రజలలో ఐక్యత భావనను కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31ని ” రాష్ట్రీయ ఏక్తా దివస్” గా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా దేశ ఐక్యత,సమగ్రత,భద్రతకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు .
ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.

Share This Post