MBNR – దేశాన్ని సార్వభౌమ,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యాంగా నెలకొల్పుకోనేందుకు, దేశంలోని ప్రజలకు స్వేచ్ఛ,సమానత్వం లతోపాటు, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఏ విధంగా పని చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని మొదటి అదనపు మరియు జిల్లా సెషన్స్ జడ్జ టి. రఘురాం అన్నారు.

దేశాన్ని సార్వభౌమ,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యాంగా నెలకొల్పుకోనేందుకు, దేశంలోని ప్రజలకు స్వేచ్ఛ,సమానత్వం లతోపాటు, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఏ విధంగా పని చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని మొదటి అదనపు మరియు జిల్లా సెషన్స్ జడ్జ టి. రఘురాం అన్నారు.
శుక్రవారం ఆయన జిల్లా కోర్టు సముదాయం లోని న్యాయ సేవాధికార సంస్థ లో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1949, నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని మనకు మనం అంగీకరించుకొని అమలులోకి తెచ్చుకున్న సందర్బంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు.
భారత రాజ్యాంగం అతి గొప్పదని, అన్ని దేశాల రాజ్యాంగాల ను క్షున్నంగా అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, ఇందులో ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రముఖపాత్ర పోషించారని అన్నారు. భారత రాజ్యాంగం చాలా క్లిష్టమైన ధైనప్పటికి సరళమైనది కూడా అని, ఇప్పటివరకు ఎన్నో సవరణలు చేసుకోవడం జరిగిందని అన్నారు. దేశంలోని శాసన, కార్యనిర్వాహక ,న్యాయ వ్యవస్థలు రాజ్యాంగం పరిధిలో లోబడి పనిచేసెలా రాజ్యాంగం రూపొందించుకున్నామని తెలిపారు. సర్వసత్తాక ,ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లుతున్నదని రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కుల తో పాటు, బాధ్యతలు కూడా ఉన్నాయని, ఎన్నికైన ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పని చేయాలో రాజ్యాంగంలో సూచించడం జరిగిందని ,ఇలాంటి మంచి రాజ్యాంగం అవతరణ దినోత్సవం గా మనం నిర్వహించుకొంటున్నామని తెలిపారు.
ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకటరామన్, సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం .సంధ్యారాణి, ఫస్ట్ క్లాస్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ శ్రీదేవి, స్పెషల్ మొబైల్ కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ పి.బి. కిరణ్ కుమార్, ఎక్సైజ్ కోర్టు స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు హనుమంతు తదితరులు మాట్లాడారు.
సీనియర్ అడ్వకేట్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post