దేశ రక్షణలో భాగంగా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపలా కాస్తున్న సైనికులకు సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు అన్నారు.
సైనికదళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ నే ధ్యేయంగా పోరాడుతున్న సైనికులకు ప్రతి ఒక్కరు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు .ప్రతి ఒక్కరు వారికి,వారి కుటుంబాలకు అండగా నిలబడి స్ఫూర్తినివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి టి.వనజ,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.