MBNR – దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

             దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
              బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మలేరియా, డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రారంభించారు.
               ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఇండ్ల లో నీరు నిల్వ ఉండడం వల్ల డెంగ్యూ ,మలేరియా వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉందని, అందువల్ల ఇండ్లలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాత టైర్లు,
కొబ్బరి చిప్పల లో నీటిని బయట పారబోసేవిధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు.మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పై జిల్లా మలేరియా అధికారి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు .
                2014 కు పూర్వం మహబూబ్ నగర్ పట్టణం విద్యుత్, తాగునీరు అన్నింటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నదని, ప్రస్తుతం ప్రతిరోజు తాగునీటితో పాటు, అంతరాయం లేని విద్యుత్ వస్తున్నదని, మున్సిపాలిటీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నదని, మున్సిపాలిటీల అభివృద్ధికి ఇది తార్కాణమని అన్నారు. పట్టణం లో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, అందువల్ల ప్రత్యేకించి మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.
                 మహబూబ్ నగర్ జిల్లా ఇటీవలే రెండు కోట్ల విత్తన బంతులతో అతి పెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వన్దర్ రికార్డ్ సాధించిందని ,అలాగే రామప్ప దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి పొంది యునెస్కో గుర్తింపు పొందినదని మంత్రి వెల్లడించారు .
మున్సిపల్ చైర్మన్ కె. సి. నర్సింలు మాట్లాడారు.
                  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ,జిల్లా మలేరియా అధికారి విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, వార్డు కౌన్సిలర్లు జ్యోతి ,షబ్బీర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ ,డెమో తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post