MBNR – ధరణి రిజిస్ట్రేషన్లు పూర్తి పారదర్శకంగా జరగాలని , ఎలాంటి మోసం జరగడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

ధరణి రిజిస్ట్రేషన్లు పూర్తి పారదర్శకంగా జరగాలని , ఎలాంటి మోసం జరగడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్లయితే ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి తాసిల్దారు లతో ధరణి పోర్టల్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిడ్జిల్ మండలం లో ధరణి పోర్టల్ ద్వారా ఇటీవల మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ తాహసిల్దార్ లు ధరణి రిజిస్ట్రేషన్ల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా ధరణిలో మోసానికి పాల్పడిన వారిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని అన్నారు .ధరణిలో జరిగిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం తోపాటు, బాధ్యులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. మిడ్జిల్ సంఘటనకు సంబంధించి మహబూబ్ నగర్ ఆర్ డి ఓ పద్మశ్రీని విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయం పై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధరణిలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులపై మండలాల వారీగా తాహసిల్దార్ లతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు,మ్యుటేషన్లు,సక్సెసన్లు,పి ఓ బి కేసులు, కోర్టు కేసులు,వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉన్న అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .అలాగే ధరణి డాష్ బోర్డ్ పై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు,ఆర్ డి ఓ పద్మశ్రీ ,తహసిల్దారులుఈ వీడియో కాన్ఫెరెన్సు కు హాజరయ్యారు.

Share This Post