MBNR – ధాన్యం సేకరణ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

ధాన్యం సేకరణ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
శుక్రవారం ఆయన దాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల పై క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
దాన్యం కొనుగోలు కు సంబంధం ఉన్న అధికారులందరూ ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ,నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్ లతోపాటు, తేమ కొలిచే యంత్రాలు,తూకం యంత్రాలు ఇవ్వాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, డిఆర్డిఓ ,మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు రోజుకు కనీసం 10 కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని, తాహసిల్దార్ 4 ,వ్యవసాయ అధికారులు 5 ,వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా వారి పరిధిలోని కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజూ తప్పనిసరిగా సందర్శించడమే కాకుండా, తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా ఉండవద్దని, ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తే కూడదని ఆయన అన్నారు.
ఈ నెల 27న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ,నిర్వాహకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే వారందరికీ తప్పనిసరిగా వాక్సిన్ వేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్సు లో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు,జిల్లా వ్యవసాయ అధికారిని సుచరిత,డి ఆర్ డి ఓ యాదయ్య, ఏ పి ఎం లు,సి సి లు, తదితరులు హాజరయ్యారు.

Share This Post