@ నవాబ్ పేట మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
@ధరణి, బృహత్ పల్లే ప్రకృతి వనాలు,సి ఎం గిరి వికాసం, మన ఊరు- మనబడి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు
ధరణిలో నూతనంగా వచ్చిన టిఎం- 33 మాడ్యూల్ ను పూర్తిగా పరిశీలించిన మీదట తాహసిల్దారులు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు ఆదేశించారు.
గురువారం అయన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండల తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పనితీరును పరిశీలించారు. ధరణిలో స్పష్టంగా ఉన్న కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ధరణికి సంబంధించిన పనిని ఒక నిర్దేశిత పద్ధతి ప్రకారం చేయాలని సూచించారు .
అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని ఏన్మగండ్ల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి బృహథ్ పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, సుందరీ కరణ బాగున్నాయని, ఒక బాధ్యతతో పనిచేస్తే గుట్టల పైన అయినా సరే చెట్లను పెంచవచ్చని నిరూపించారని అభినందించారు.
అనంతరం తుక్యా సీఎం గిరి వికాసం పథకం కింద రైతు పొలాలను తనిఖీ చేశారు. విద్యుదీకరణ ,టమాటా రైతు తోటలను పరిశీలించి సరైన సమయంలో డిమాండ్ ఉన్న సమయంలో టమాటా వంటి తోటలను నూతనంగా ఆలోచించి వేసుకోవడం అభినందనీయమని అన్నారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ రుద్రారం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ మన ఊరు- మనబడి కింద పనులను తనిఖీ చేస్తూ పనులు నాణ్యతగా ఉండాలని, నాణ్యమైన మెటీరియల్ వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక విద్యార్థులతో మాట్లాడుతూ వారిచేత రైమ్స్ పాదించార.
జిల్లా కలెక్టర్ వెంట తాహసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత ,ఏపీ డి జకీయా సుల్తానా తదితరులు ఉన్నారు.