MBNR – నిర్దేశించిన 15 రోజుల్లో జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ సాధించేందుకు వాక్సినేషన్ సిబ్బంది,వైద్యులు ఉదయమే వాక్సినేషన్ కేంద్రాలకు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు ఆదేశించారు.

నిర్దేశించిన 15 రోజుల్లో జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ సాధించేందుకు వాక్సినేషన్ సిబ్బంది,వైద్యులు ఉదయమే వాక్సినేషన్ కేంద్రాలకు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు ఆదేశించారు.
15 రోజుల్లో 100 శాతం వాక్సినేషన్ సాధించడంలో భాగంగా గురువారం ఉదయమే జిల్లా కలెక్టర్ వాక్సినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ముందుగా ఆయన మహబూబ్ నగర్ లోని భగీరథ కాలనీలో ఉన్న లక్ష్మి నివాస్ అపార్ట్మెంట్ లో వాక్సినేషన్ ను తనిఖీ చేశారు. అపార్ట్మెంట్ లో ఎంత మంది ఉంటున్నారని,ఇప్పటివరకు ఎంత మంది వాక్సిన్ వేయించుకున్నారని,ఇంకా ఎంత మంది వాక్సిన్ వేయించుకోవాల్సి ఉందని అపార్ట్మెంట్ వాసులను అడిగారు.అన్ని వాక్సినేషన్ కేంద్రాల వద్ద ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని ,సంచార వాహనాల ద్వారా ప్రచారం చేయాలని డి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు.
ఆనంతరం జిల్లా కలెక్టర్ భూత్పూర్ పి హెచ్ సి లో వాక్సినేషన్ ను తనిఖీ చేశారు.జిల్లా లో నిర్దేశించిన 15 రోజుల్లో వంద శాతం వాక్సిన్ పూర్తి చేయాలంటే అందరూ కష్ట పడి పని చేయాలని,ముఖ్యంగా వైద్య అధికారులు,సిబ్బంది ఉదయమే గ్రామాలకు వెళ్లాలని ఆదేశించారు.
వాక్సినేషన్ వేసుకొనని వారిని గుర్తించి వాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్యాధికారులతో పాటు,ప్రత్యేకాధికారులు కూడా వాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.వాక్సినేషన్ పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు తో సహా మండల ప్రత్యేక అధికారులందరు గురువారం ఉదయం నుండే వాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు.
డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ,భూత్పూర్ పి హెచ్ సి డాక్టర్ సత్యనారాయణ ఉన్నారు.

Share This Post