MBNR – నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన పనులకు తుది రూపం తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.

నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన పనులకు తుది రూపం తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులపై సమీక్ష నిర్వహించారు.
మిగిలిపోయిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా సమావేశ మందిరంలో పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ పనులు, ఆడియో, విజువల్ పనులు, ఆర్చ్ ,స్టేట్ బోర్డ్ రూమ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.ఆర్చి ,ఐలాండ్ , సెంట్రల్ మీడియన్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్ పనులకు సంబంధించి తక్షణమే మరోసారి లేఖ రాయాలని సూచించారు. మహబూబ్ నగర్ పట్టణంలో చేపట్టిన రోడ్డు పనులను సమీక్షించారు .
ఆ తర్వాత దేవరకద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ ఆర్ ఓ బి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశానికి అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్,కె. సీతారామారావు, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో ఏస్ ఈ లు ఎం నర్సింగమ్,మూర్తి, ఈ లు స్వామి,రాజేందర్,డి పి ఓ వెంకటేశ్వర్లు,ఆర్ డి ఓ పద్మశ్రీ, తదితరులు హాజరయ్యారు.

Share This Post