MBNR – నెక్లెస్ రోడ్డు,సస్పెన్షన్ బ్రిడ్జ్ ల నిర్మాణం లో భాగంగా ట్యాంక్ బండ్ లో నీటి తోడివేత, పూడికతీత ,గుర్రపు డెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

@ ఈ నెల 1 న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ బండ్ సందర్శన, ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పనులపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
@నెక్లెస్ రోడ్డు,సస్పెన్షన్ బ్రిడ్జ్ ల నిర్మాణం లో భాగంగా ట్యాంక్ బండ్ లో నీటి తోడివేత, పూడికతీత ,గుర్రపు డెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
నెక్లెస్ రోడ్,సస్పెన్షన్ బ్రిడ్జి, వాకింగ్ ట్రాక్, శిల్పారామం పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు గురువారం ఇంజనీరింగ్,మున్సిపల్,టూరిజం అధికారులతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.
ఈనెల 1న రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ బండ్ సందర్శన సందర్బంగా నెక్లెస్ రోడ్ నిర్మాణానికై జారీ చేసిన ఆదేశాలను వెంటనే అమలలో పెట్టాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నెక్లెస్ రోడ్డు,మినీ ట్యాంక్ బండ్ లో సస్పెన్షన్ బ్రిడ్జి పనులు చేపట్టేందుకు గాను ట్యాంక్ బండ్ లో ఉన్న నీటిని తోడి వేయాలని, ఇందుకు గాను అవసరమైతే ఎక్కువ కెపాసిటీ మోటార్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ట్యాంకు బండు చుట్టూ పది మీటర్ల మేర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం పనులు చేపట్టాలని చెప్పారు. బండ్ విస్తరణ కు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలని తాహసిల్దార్ ను ఆదేశించారు.
కాగా సస్పెన్షన్ బ్రిడ్జి కి సంబంధించి అలైన్మెంట్ నిర్ణయించడం జరిగిందని, పనులు నడుస్తున్నాయని టూరిజం ఏ ఈ జిల్లా కలెక్టర్ కు వివరించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ఎఫ్ టి ఎల్ ,బఫర్ జోన్ నిర్ధారణలో తహసీల్దార్ తో పాటు ,టౌన్ ప్లానింగ్ అధికారులు చురుకైన పాత్ర పోషించాలన్నారు.మరో సారి సంబంధిత అధికారులతో ట్యాంక్ బండ్ ను సందర్శించేందుకు ఆయన నిర్ణయించారు.
పి ఆర్ ఎల్ ఐ చీఫ్ ఇంజనీర్ రమేష్, పర్యాటకశాఖ ఏండి. మనోహర్ లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నిర్దేశించిన సమయనుసారం పనుల పూర్తి కి హామీ ఇచ్చారు.
ఎస్ ఈ. నర్సింగరావు,ఇరిగేషన్, టూరిజం ఏ ఈ రోహిత్, మున్సిపల్ ,టౌన్ ప్లానింగ్ అధికారి ప్రతాప్, అర్బన్ తహసీల్దార్ పార్థ సారథి, తదితరులు ఈ వీడియో కాన్ఫెరెన్సు కు హాజరయ్యారు.

 

Share This Post