MBNR – నేటి మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

నేటి మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్బంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కన్నా ముందు దేశంలో మహిళలు చదువుకుంటే అరాచకాలు చేసేవారిని,సీసం పొసే వారని, వీటన్నిటిని రూపుమాపేందుకు మహాత్మ జ్యోతిబాపూలే తన భార్యను చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని అన్నారు.
మహిళల ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ,మహిళ చదువుకుంటే కుటుంబం యావత్తూ చదువుకున్నట్లు అని భావించి సవిత్రిబాయి పూలే పట్టుదలతో చదివి మహిళా ఉపాధ్యాయురాలు గా ఎదిగారని ఆయన అన్నారు. జ్యోతిబా పూలే వల్లనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బడుగు, బలహీన వర్గాలకు, దళిత బహుజనులకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని, సామాజిక స్పృహతో వారు కల్పించిన రిజర్వేషన్ల వల్ల అనేకమంది ఉన్నత పదవులను అధిరోహించడమే కాకుండా, సమాజంలో గొప్ప వాళ్ళు గా నిలబడ్డారని ఆన్నారు మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలెను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసిందని ,బడుగు బలహీన వర్గాల వారికి విదేశీ విద్యకు స్కాలర్ షిప్ ను ఇస్తున్నదని తెలిపారు. చదివితేనే అభివృద్ధి సాధ్యమన్న సావిత్రిబాయి పూలే ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని, ఆమె ఆశయ సాధనకు అనుగుణంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాయకంటి రామదాసు, పూలే సంఘ నాయకులు, ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Share This Post