MBNR – పదవ తరగతి పరీక్ష కేంద్రాలలోకి ఎవరి సెల్ ఫోన్లకు అనుమతి లేదు-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు.

@పదవ తరగతి పరీక్ష కేంద్రాలలోకి ఎవరి సెల్ ఫోన్లకు అనుమతి లేదు-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు.

ప్రశ్నపత్రం లీక్ కాకుండా రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి కేంద్రం వద్ద ఒక
ఎ ఎన్ ఎం తో పాటు,తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థులు బెంచీలు కుర్చీల పైననే పరీక్ష రాసే విధంగా చూడాలని, ప్రతి సెంటర్లో డ్యూయల్ డెస్కులు ఏర్పాటు చేయాలని అన్నారు.పరీక్ష కేంద్రంలోకి ఎవరైనా సెల్ ఫోన్ తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రహరీలు లేని పాఠశాలలకు కంపతో తాత్కాలిక కంచె వేయించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షకేంద్రం చీఫ్ సూపరింటిండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతో విద్యార్థుల హాజరు, పరీక్ష కేంద్రంలో పరిశుభ్రత ,తాగునీరు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పదవ తరగతి పరీక్షల పై రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షిస్తూ అన్ని పరీక్ష పరీక్ష కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు పారిశుద్ధ్య చర్యలు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం అర్ధరాత్రి వరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను కొనసాగించాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారిని ఆదేశించారు .పరీక్షలు పూర్తయ్యేవరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ ఈ ని ఆదేశించగా, ప్రతి రోజు స్పెషల్ ఆఫీసర్లు వారి పరిధిలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామ రావు,జిల్లా అధికారులు హాజరయ్యారు.

 

 

Share This Post