MBNR – పరిపాలన దక్షులను ఎన్నుకోవడంలో ఓటు వజ్రాయుధం- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

@ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో ముఖ్యమైన ఆయుధం
@ పరిపాలన దక్షులను ఎన్నుకోవడంలో ఓటు వజ్రాయుధం- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు .
మంగళవారం 12 వ “జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని” పురస్కరించుకొని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, ఓటుకు ఎంతో ప్రత్యేకత ఉందని ,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావడమే కాకుండా తప్పకుండా ఓటు వేయాలని అన్నారు. భారతదేశంలో నిర్వహిస్తున్న ప్రకాస్వామ్య ప్రక్రియను ఎన్నో దేశాలు అధ్యయనం చేస్తున్నాయిని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కేంద్ర ఎన్నికల సంఘం ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నదని, 130 కోట్ల జనాభా లో ఓటర్లు అనేక వ్యవస్థలని ఉపయోగించి ప్రతి 5
ఏళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైనదని, మంచి పరిపాలనా దక్షులను ఎన్నుకొనే బాధ్యత ఓటరు పై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు, ఓటు అనే వజ్రాయుధాన్ని సరిగా వినియోగించుకున్నప్పుడే ప్రజా స్వామ్యం ఫరిడవిల్లుతుందన్నారు. మంచివారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మంచి శాసనాలు వస్తాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఎన్నికలలో ఓటు వేయాలని అని ఆయన పిలుపునిచ్చారు.
పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్ .బి. లక్ష్మి కాంత్ రాథోడ్ మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఓటుకు ఎంతో విలువ ఉందని అన్నారు. మంచి వారిని నాయకులుగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్యం లో అతి ముఖ్యమని, ఇది వచ్చే తరానికి ఎంతో సహాయకారిగా ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఈ- పోర్టల్ ద్వారా ఇంట్లోనే ఉండి ఓటర్ గా నమోదు చేసుకోవడమే కాకుండా ఓటర్ కార్డు ను కూడా ఇంటికే వచ్చేలా అవకాశం కల్పించిందని తెలిపారు.
అంతకుముందు మహబూబ్ నగర్ అర్బన్ తాసిల్దార్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. అంతేకాక సీనియర్ సిటీజన్లయిన వారిని సన్మానించారు. దీంతోపాటు ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Share This Post