MBNR – పల్లెలు, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

పల్లెలు, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్ నగర్ లో 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
వార్డు సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాలలో ఎంతో ప్రగతి వచ్చిందని, ప్రజలు కూడా దీనిని ప్రత్యక్షంగా గమనించ వచ్చని అన్నారు .గతంలో మున్సిపాలిటీలో ప్రతి వీధిలో తాగునీటి సమస్య ఉండేదని ,మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను తీర్చడం జరిగిందని తెలిపారు .
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 300 కోట్ల రూపాయలతో రహదారులు, మురికి కాలువలు అభివృద్ధి చేయడం జరిగిందని, 100 కోట్ల రూపాయలతో పెద్ద చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతున్నామని ,మరో 200 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారిని అభివృద్ధి చేయడం జరిగిందని, మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అప్పనపల్లి రెండవ రైల్వే బ్రిడ్జి ని రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రేమ్ నగర్ లో త్వరలోనే పాఠశాల భవనం మరమ్మతులు చేపట్టి పూర్తి చేస్తామని, అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని , వార్డులోని మహిళలలు కుట్టు మిషన్ కేంద్రం కావాలని కోరగా వారం రోజుల్లో కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటుతోపాటు, కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్ లను కూడా ఉచితంగా ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడమే, పేదల సంక్షేమం కోసమే తాము పని చేస్తున్నామని తెలిపారు.
బ్ అనంతరం మంత్రి వార్డులో పర్యటించి సమస్యలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడారు.
మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు,ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ కిషోర్ ,38వ వార్డు కౌన్సిలర్ రాజేశ్వరమ్మ,, ట్రాన్స్కో ఎస్ ఈ మూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ సుబ్రమణ్యం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

 

 

Share This Post