@మన ఊరు- మన బడి విద్యా యజ్ఞం లాంటిది
@పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని పనులు పూర్తి కావాలి -రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు
మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ఒక పండగలా, ఉద్యమంలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
సోమవారం ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి హైదరాబాద్ నుండి మన ఊరు- మన బడి పై అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మన ఊరు- మన బడి కింద పనులకు మంజూరు ఇచ్చేముందు జిల్లా కలెక్టర్లు సాధ్యమైనంత వరకు అన్ని పాఠశాలలను తిరిగి చూసి మంజూరు ఇవ్వాలని కోరారు.కవర్ షేడ్ లో తక్కువ ఖర్చుతో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల హాజరు ఆధారంగానే ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. 30 లక్షల రూపాయల కన్నా తక్కువ పనులు చేపట్టే పాఠశాలల్లో ఈనెల 1 5 లోపు పనులు పూర్తి చేయాలన్నారు. 30 లక్షలకు మించి పనులు చేపట్టే పాఠశాలలకు మే చివరినాటికి టెండర్లను పూర్తిచేయాలని అన్నారు.మన ఊరు- మనబడి పనులు ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులు అందర్నీ భాగస్వాములను చేసి పండగలా నిర్వహించాలన్నారు. మన ఊరు- మనబడి ద్వారా పనులు పూర్తయిన చోట నాడు- నేడు ఫొటోలను సోషల్ మీడియా తో పాటు, అందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మన ఊరు- మన బడి కింద చేపట్టే పనులను నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని నియమించి పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటర్మీడియట్ ,పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు .
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ మొదటి విడత రాష్ట్రంలో మన ఊరు- మన బడి కింద 9123 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. పది రోజుల లోపు అన్ని పాఠశాలల పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని ,అంచనాలు జాగ్రత్తగా రూపొందించాలని, 30 లక్షల కన్నా తక్కువ ఉన్న పాఠశాలల పనులు ఈ నెల 15 లోపు పూర్తిచేయాలని, 30 లక్షలకు మించి న పనులకు మేచివరి నాటికి టెండర్లు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ,ప్రారంభోత్సవాలలో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మన ఊరు- మనబడి కార్యక్రమం కింద మహబూబ్ నగర్ ,నారాయణపేట జిల్లాలకు సంబంధించి మొదటి విడత చేపట్టే పనుల అంచనాలను నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయిలో సమర్పిస్తామని, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం లో మోడల్ గా పనులు పూర్తి చేసే పాఠశాల జాబితాను కూడా వెంటనే ఇస్తామని చెప్పారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఈవో ఉషారాణి, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు