MBNR – పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునేలా చూడాలి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునేలా చూడాలి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాఠశాలలను తిరిగి ప్రారంభించినందున పాఠశాలల్లో పూర్తి కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని సి. ఎస్ చెప్పారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు,డి ఎం హెచ్ ఓ ల తో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు,పరిశుభ్రత,మధ్యాహ్న భోజనం,తదితర అంశాల పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
చాలా రోజుల తర్వాత పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని ,అయితే ఏ పాఠశాలలో కూడా కరోనా కేసులు నమోదు కాకూడదని ఇందుకుగాను పాఠశాలల్లో పూర్తి స్థాయి కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని,అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితో సహా ,18 సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరు వాక్సిన్ తీసుకొని ఉండాలని, ఇంకా ఎవరైనా వాక్సిన్ తీసుకోకుంటే వెంటనే తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల నూటికి నూరు శాతం వాక్సిన్ పూర్తయినట్టు ఒక బ్యానర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే సోమవారం నుండి విద్యార్థుల హాజరు సైతం పెరిగేందుకు అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్ తో పాటు, సీనియర్ అధికారులు పాఠశాలల ను సందర్శించాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ ,డీఈఓ ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ,డి పి ఓ వెంకటేశ్వర్లు తదితరులు ఈ టేలి కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Share This Post