MBNR – పారిశుద్ధ్యం ,హరితహారం వంటి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.

పారిశుద్ధ్యం ,హరితహారం వంటి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు.
పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు తీసుకున్నట్లయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని, అందువల్ల మురికి కాల్వలను శుభ్రం గా ఉంచుకోవడంతో పాటు, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని,స్వచ్ఛమైన తాగు నీరు తీసుకోవాలని అన్నారు .హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. ముఖ్యంగా పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని కలెక్టర్ కోరారు. మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడి ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల విద్య ,రైతు వేదికలు, గ్రామపంచాయతీ పనితీరు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ ,నర్సరీలు, రైతు బీమా, రైతు బంధు, రైతు వేదిక, పెన్షన్లు తదితర అంశాలపై ప్రజలతో ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు.
ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ పార్వతమ్మ అధ్యక్షత వహించగా, ప్రత్యేక అధికారి ,డిటీడీవో చత్రు నాయక్ ,తాహసిల్దార్ ఆంజనేయులు,ఎం పి డి ఓ రూపేందర్ రెడ్డి ,పంచాయతి సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి ,ఎంపీవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తదితరులు హాజరయ్యారు.

 

 

 

 

Share This Post