MBNR – పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శనలో భాగంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ బృందం గురువారం మహబూబ్ నగర్ జిల్లాలోని కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్ తో పాటు,కొన్ని చెరువులను పరిశీలించింది.

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు బృందం సభ్యులు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లు,చెరువులు, సాంకేతికపరమైన అంశాలతో పాటు ,ఇతర విషయాలపై నిన్న, ఈరోజు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.
సి ఎస్ ఐ ఆర్,సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,మైనింగ్ శాఖల ప్రతినిధులతో పాటు , నోడల్ ఏజెన్సీ ప్రతినిధులు ,ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టరు తేజస్ నందలాల్ పవార్ లు కమిటీ సభ్యులతో పాటు ఉన్నారు.
కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు, చెరువులు పరిశీలించిన బృందం వారి నివేదికను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు అందజేయనుంది.

Share This Post