MBNR – పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపట్టనున్న పునరావాస కేంద్రాలకు సంబంధించిన టెండర్ల పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపట్టనున్న పునరావాస కేంద్రాలకు సంబంధించిన టెండర్ల పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, జాతీయ రహదారులు, రైల్వే తదితర ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పనులు, పునరావాస కేంద్రాల పై రెవెన్యూ, ఇంజనీరింగ్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా ఇదివరకే టెండర్లు పిలవడం జరిగిందని, అయితే ఇందుకు సంబంధించి బిడ్స్ పరిస్థితి పై సమీక్షించారు. అనుకున్న సమయంలో టెండర్లను ఫైనల్ చేయాలని చెప్పారు. అదేవిధంగా పీఎన్ కి సంబంధించి అభ్యంతరాలపై సవరణలను తక్షణమే జారీ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పునరావాస కేంద్రాలలో ల్యాండ్ లెవెలింగ్ పనులు, అంతర్గత రహదారులు, సవరించిన అంచనాలకు త్వరగా అనుమతులు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రైల్వే ప్రాజెక్ట్ ల భూసేకరణ, జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్షించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు,డి ఆర్ ఓ కె. స్వర్ణలత, ఇంజనీరింగ్ అధికారులు,రెవెన్యూ అధికారులు తదితరులు హాజరయ్యారు.

Share This Post