MBNR – పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అవార్డుల ను వచ్చే మంగళవారం నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు.

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అవార్డుల ను వచ్చే మంగళవారం నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ పై ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాలకు సంబంధించి రెండు అవార్డు స్టేజిలో ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయన పై విధంగా స్పందించారు .
రైల్వే ప్రాజెక్టుల కింద చేపట్టిన పేరూరు రైల్వే స్టేషన్ భూ సేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను తక్షణం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కోస్గి- చించోలి రహదారికి సంబంధించిన ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తయినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు . పిఎన్ ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
భూసేకరణ సందర్బంగా ఉద్యాన మొక్కలు,అటవీ భూములను సంబంధించిన అంశాలు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ ,సంబంధిత మండలాల తహసిల్దారులు ,ఇరిగేషన్ ప్రాజెక్టుల ఇంజనీర్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్సు కు హాజరయ్యారు.

Share This Post