పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజాలనుంది మంచి స్పందన వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.
మహబూబ్ నగర్ ,నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలోని 4 లక్షల 97 వేల 976 హెక్టార్లకు సాగు నీరు, 1226 గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు 90 టీఎంసీల వరదనీటిని 60 రోజులలో తోడి 5 దశలలో ఎత్తిపోసి 6 రిజర్వాయర్ల నింపటం ద్వారా సాగునీరు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై పర్యావరణ ప్రజాభిప్రాయాన్ని మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించారు.
ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు అధ్యక్షతన జరగగా ఈ ప్రజాభిప్రాయ సేకరణకు పలువురు రైతులు, రైతు సమాఖ్య ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో ప్రజా ప్రతినిధులు, రైతులు, రైతు సమాఖ్య నాయకులు, విశ్రాంత ఇంజనీరింగ్ అధికారుల సంఘాల ప్రతినిధులు,ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది . వీటన్నింటిని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయడం జరిగిందని, వీటన్నింటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రజాభిప్రాయ సేకరణ కు ముందు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సూపరిండెంట్ ఇంజనీర్ డి. నరసింగరావు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్యాంశాలను తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా ముందుగా పర్యావరణానికి సంబంధించిన అంశంపై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించనునట్లువెల్లడించారు. ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాలను అన్నింటినీ రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజక్టులను నిర్మించే సమయంలో ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం సర్వసాధారణమని, ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాలోని 1226 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటితో పాటు, తాగునీరు కూడా అందుతుందని ఆయన తెలిపారు.
కాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం . దయానంద్ మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణం పై అధ్యయనం చేసిన ఓయాంట్స్ కన్సల్టెన్సీ తరఫున డిప్యూటీ మేనేజర్ సమాపిక మిశ్రా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మండలాలలో నిర్వహించిన పర్యావరణ సర్వేపై సమగ్ర వివరాలను పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కు వచ్చిన ప్రజలు, రైతులు, అధికారులకు వివరించారు.
జిల్లా ఎస్ పి ఆర్ వెంకటేశ్వర్లు,అడిషనల్ ఎస్ పి వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంజనీర్లు,ఇతర ఇంజనీరింగ్ అధికారులు,ఆర్ డి ఓ పద్మ శ్రీ,తహసీల్దార్ బక్క శ్రీనివాస్,ఎం పి డి ఓ ధనుంజయ్ గౌడ్,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ ప్రజాభిప్రాయ సేకరణలో హన్వాడ మండలం కోనగట్టు పల్లి కి చెందిన వెంకటరెడ్డి, టివి యూ వి రాష్ట్ర కార్యదర్శి బి నాగన్న, హన్వాడకు చెందిన కొండా లక్ష్మయ్య, తెలంగాణ ఇంజనీర్ల సంఘం ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి, తెలంగాణ ఇంజనీరింగ్ అసోసియేషన్ జేఏసీ ప్రతినిధి వెంకటేష్, గండీడ్ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, హన్వాడ మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి వేపూరి యాదిరెడ్డి విశ్రాంత ఇంజనీరు నారాయణ గౌడ్, తెలంగాణ వృత్తిదారుల సంఘం నుండి వెంకటయ్య, భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ మల్లు నరసింహ రెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్ష్యులు దేవేందర్ రెడ్డి ,గదిర్యాల్ సర్పంచ్ వెంకటరమణా రెడ్డి, ఎమ్మార్పీఎస్ హన్వాడ అధ్యక్షుడు జమలయ్య, రైతు రాజ్యం పార్టీ తెలంగాణ బాలకృష్ణ, సల్లోని పల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ, గండేడ్ మండలం నుండి కృష్ణయ్య గౌడ్, ఎంపీటీసీ చెన్నయ్య, మనాన్, యారోనీపల్లి నుండి అనంత రెడ్డి ,బాలాజీ, రాములు తదితరులు వారి అభిప్రాయాలను వెల్లడించారు.


