MBNR – పాలమూరు విశ్వవిద్యాలయంలో 20 రోజుల్లో లక్ష మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు

పాలమూరు విశ్వవిద్యాలయంలో 20 రోజుల్లో లక్ష మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
శుక్రవారం కలెక్టర్ పాలమూరు విశ్వవిద్యాలయంలో హరితహారం కింద యూనివర్సిటీ లో చేపట్టనున్న మొక్కల పెంపకంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ,అధ్యాపక బృందం, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పాలమూరు యూనివర్సిటీ దట్టమైన వృక్షాల మధ్య ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక అని, ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు రానున్న 15,20 రోజుల్లో యూనివర్సిటీ లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. ఇందుకుగాను అవసరమైన మొక్కలను సరఫరా చేయాలని డి ఎఫ్ ఓ,డి ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. యూనివర్సిటీలో పదెకరాల లో బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని చేపట్టాలని, ఐదెకరాల విస్తీర్ణంలో ఎర్ర చందనం,టేకు, ఇతర వృక్షాలతో సంపద వనాలను అభివృద్ధి చేయాలని, అంతేకాక యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న కొండలపై పండ్ల వనాలను పెంచాలన్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా యూనివర్సిటీ నాలుగు వైపుల నీటి సరఫరా చేసి నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ,మున్సిపల్, అటవీ, డి ఆర్ డి ఏ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యూనివర్సిటీని హరిత విశ్వవిద్యాలయంగా మార్చాలని అన్నారు.
యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రిజిస్ట్రార్ పిండి పవన్ కుమార్, వి సి ఓ ఎస్ డి మధుసూదన్, డిఎఫ్ఓ గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటరమణ, ఉద్యాన శాఖ ఎడి సాయిబాబా, యూనివర్సిటీ ఆయా విభాగాల అధిపతులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post