MBNR – పాలమూరు విశ్వవిద్యాలయాన్ని పచ్చదనం గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్ డి ప్రియాంక వర్గీస్ అన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయాన్ని పచ్చదనం గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్ డి ప్రియాంక వర్గీస్ అన్నారు.
మంగళవారం ఆమె పాలమూరు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ మొత్తాన్ని తిరిగి హరితహారం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు.హరిత హారం కింద ఇంకా యూనివర్సిటీ లో మొక్కలు నాటేందుకు పలు సూచనలను చేశారు.
జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు ముఖ్యమంత్రి ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డి ఎఫ్ఓ గంగిరెడ్డి ,పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్త్రార్ పిండి పవన్ కుమార్, వి సి ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ నూర్జహాన్, జడ్చర్ల డిగ్రీ కళాశాల అధ్యాపకులు సదాశివయ్య, ఆయా విభాగాల అధిపతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post