MBNR – పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పై దృష్టి సారించండి – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పై దృష్టి సారించండి – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
సోమవారం జిల్లా కలెక్టర్ ధరణి పెండింగ్ దరఖాస్తుల పై తాసిల్దారులతో కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న వివిధ రకాల ధరణి దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్, సక్సేషన్ దరఖాస్తుల పరిష్కారంపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రాని వారిని గుర్తించి ఫోన్ ద్వారా సంప్రదించి వారు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పెండింగ్ లో ఉన్న పి ఓ బి,సక్సేషన్,జి ఎల్ ఎం,మ్యుటేసన్ ,నాళా, కోర్ట్ కేసులు,పాసుబుక్కుల జారీ తదితర దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు,ఆర్ డి ఓ పద్మశ్రీ,కలెక్టర్ కార్యాలయం ఏ ఓ ప్రేమ్ రాజ్,కలెక్టర్ కార్యాలయం విభాగాల అధిపతులు,తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

Share This Post