MBNR – పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

@పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని అశోక్ థియేటర్ చౌరస్తా ప్రధాన మురికి కాలువలో 10 లక్షల 30 వేల రూపాయలతో ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వేరు చేసే యంత్రాన్ని ప్రారంభించారు .
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గతంలో మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ లు వార్డులలో తిరగలేని పరిస్థితి ఉండేదని, తాగునీటికి ,విద్యుత్ తో పాటు, అనేక సమస్యలు ఉండేవని అన్నారు .ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణం చాలా బాగా అభివృద్ధి చెందిందని, ముఖ్యంగా ప్రధాన మురికి కాలువల్లో మురికి కాలువలో చెత్తా,చెదారం నిండిపోకుండా కాలువలో వచ్చే ప్లాస్టిక్ ను తక్షణమే వేరు చేసే విధంగా నూతన టెక్నాలజీతో ఒక యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ట్యాంకుబండ్ లో కూడా చెత్తను తొలగించి సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చాలని అన్నారు.
వేపురుగెరి కమ్యూనిటీ హాల్ కు ఇదివరకే 14 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చామని, ఇప్పుడు మరో 15 లక్షలు కావాలని కోరారని వాటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
అశోక్ థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న మెకానిక్ షాపు ఓనర్ల భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తామని ఇదివరకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. త్వరలోనే మున్సిపాల్టీలో పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని,తాము పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు,ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.
అంతకు ముందు మంత్రి పాత పాలమూరు లోని కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ను వివాహాలు,ఇతర శుభకార్యాలు ,సమావేశాలు నిర్వహించుకునేందుకు అదేవిధంగా ఆదాయం వచ్చేలా రోడ్డుకు షాపింగ్ నిర్మించాలని, ఫాల్ సీలింగ్ లైటింగ్, ప్రహరి అన్ని సౌకర్యాలతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

 

 

Share This Post