MBNR – పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ .

పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
గతంలో జబ్బు చేసి ఆస్పత్రి పాలైతే ఆస్తులు అమ్మి ఆస్పత్రి బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండేదని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ముఖ్యమంత్రి సహాయనిధిని ఏర్పాటు చేసి సి ఎం ఆర్ ఎఫ్ కింద 10,000 మొదలుకొని లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్, రూరల్, మరియు హన్వాడ మండలాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 18 లక్షల73 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులతో మంత్రి మాట్లాడుతూ గతంలో ఆస్తులమ్మి రోగాలు నయం చేసుకునే వారని, ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థికంగా లబ్ధి పొందడంతో పాటు, అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు పెరగటం వల్ల ఆసుపత్రుల నుండి వైద్య సేవలు కూడా పొందుతున్నారని తెలిపారు.
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2014 కు పూర్వం కేవలం 14 మంది డాక్టర్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు 100 మంది డాక్టర్లు ఉన్నారని, 2 ఫార్మాసిస్టులు ఉండగా ఇప్పుడు 35 మంది 40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారని అదేవిధంగా ఆసుపత్రి లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, కరోనా సమయంలో రోగులు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి చికిత్స పొందారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నామని మంత్రి వెల్లడించారు .ఈ ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజల ప్రాణాలను కాపాడుతామని, భవిష్యత్తులో హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ తయారవుతుందని,ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు, డి సి సి బి ఉపాధ్యక్షులు కొరమోని వెంకటయ్య తదితరులు ఉన్నారు.

Share This Post