MBNR – పోడు భూములకు సంబంధించి ఈ నెల 8 నుండి జిల్లాలో అవగాహన కల్పించడంతో పాటు, క్లెయిమ్స్ స్వీకరించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.

పోడు భూములకు సంబంధించి ఈ నెల 8 నుండి జిల్లాలో అవగాహన కల్పించడంతో పాటు, క్లెయిమ్స్ స్వీకరించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో పోడు భూముల పై జిల్లా అధికారులతో సమీక్షించారు.
అటవీ భూములను సాగు చేసుకుంటున్న అర్హత ఉన్న వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద హక్కులు కల్పించే విషయమై ఇప్పటివరకు గుర్తించిన గ్రామ పంచాయతీలు,హాబీటేషన్లలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పై అవగాహన, గ్రామ సభల నిర్వహణ, క్లెయిమ్స్ ఫారాల స్వీకరణ పై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆనంతరం జిల్లా కలెక్టర్ తహశీల్దారులతో పోడు భూముల పై కూలంకషంగా సమీక్షించారు.అంతే కాక ల్లబ్ధిదారులకు సంబంధించిన వివరారాలను విచారించారు.క్లెయిమ్స్ ఫారాలు తదితర అంశాలపై సమీక్షించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,డి ఎఫ్ ఓ గంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డి టి డి ఓ చత్రు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post