MBNR – ప్రజలకు ధైర్యాన్ని, భరోసాను కల్పించేది పోలీసు ఉద్యోగం అని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ప్రజలకు ధైర్యాన్ని, భరోసాను కల్పించేది పోలీసు ఉద్యోగం అని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాదాం రామస్వామి ఆడిటోరియంలో శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నిమిత్తం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.
నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశమని,దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా నిష్ణాతులైన వారిచే మెటీరియల్ ను తయారు చేయించడం జరిగిందని ,అంతేకాక నిపుణులైన అధ్యాపకుల చే శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కోసం 5 నెలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరారు. ముఖ్యంగా మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ఉద్యోగాలు అవసరమని,5 నెలల పాటు చదువు పైనే దృష్టిసారించి ఉద్యోగాలు సంపాదించుకోవాలని అన్నారు.
శిక్షణ తర్వాత ఉద్యోగం రాకపోయినా జీవితాంతం ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు .అన్ని ఉద్యోగాలకన్న పోలీసు ఉద్యోగం ఎంతో గొప్పదని, నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం, వారిలో ధైర్యాన్ని కలిగించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు.ఎస్ ఐ, కానిస్టేబుల్ ఏ ఉద్యోగం వచ్చిన గర్వంగా ఫీల్ అవ్వాలని, నిజాయితీగా సేవలందించే వారికి పోలీస్ ఉద్యోగం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. అవసరమైతే ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తామని అన్నారు. మహిళా అభ్యర్థులకు ఎదిర సమీపంలోని గిరిజన వర్కింగ్ ఉమేన్స్ హాస్టల్ లో లేదా మరో చోట వసతి కల్పిస్తామని తెలిపారు.
శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన కోచింగ్ మెటీరియల్ ను మంత్రి పంపిణీ చేశారు .
జిల్లా ఎస్ పి ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కు శిక్షణ ఇవ్వడానికి మూడు నెలల ముందునుండి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ,మంత్రి ఆదేశాల మేరకు పటిష్టమైన మెటీరియల్ ను రూపొందించామని, మంచి అధ్యాపకులను ఏర్పాటు చేశామని, శిక్షణ పొందిన వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్, అడిషనల్ ఎస్ పి రాములు, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్,డి ఎస్ పి మహేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, కౌన్సిలర్లు గోవింద్, కోట్ల నరసింహులు, ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Post