MBNR – ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాల పర్యవేక్షణకు గురువారం నుండి జిల్లాస్థాయి అధికారులను కూడా మారుమూల ప్రాంతాలకు పంపించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.

ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాల పర్యవేక్షణకు గురువారం నుండి జిల్లాస్థాయి అధికారులను కూడా మారుమూల ప్రాంతాలకు పంపించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లేబరేటరీ ,రక్త ప్లేట్లెట్లను వేరు చేసే యంత్రాన్ని పరిశీలించడంతో పాటు, ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి పర్యవేక్షకుల గదిలో ఆస్పత్రి పనితీరు వైద్యులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యుల తో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ ,వైద్యశాలల కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ద్వారా డాక్టర్లు ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకుగాను ఆస్పత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ముందుగానే జిల్లాలో 15 రోజుల పాటు దోమలపై సమరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని , దోమలపై సమరం కార్యక్రమంలో దోమలు వ్యాపించకుండా జిల్లా వ్యాప్తంగా లక్ష సెప్టిక్ ట్యాంక్ లను జాలితో మూసివేయడం జరిగిందని, అంతేకాక నీటి గుంటలలో గంబుషియా చేపలను వదలడం, ఆయిల్ బాల్స్ వేయడం తో పాటు దోమల నివారణ ద్రావణాన్ని పిచికారి చేసి నట్టు వెల్లడించారు . ఇందులో భాగంగానే గురువారం నుండి అదనపు కలెక్టర్లు,ఆర్ డి ఒ ,స్పెషలాఫీసర్ లను మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు పంపించి పరిశుభ్రత కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నమోదు కాకుండా చూసుకోవాలని, ఒకవేళ కేసులు వచ్చినప్పటికీ సకాలంలో చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉండాలని అన్నారు.
ఇందుకుగాను ప్లేట్లెట్ల ను వేరు చేసే యంత్రానికి కిట్లు అవసరముందని, అంతేకాక ప్లేట్లెట్ ఎడిటేటర్ మిషన్ కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ ను కలెక్టర్ పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న రాష్ట్ర వైద్య శాఖ అదనపు డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ మహబూబ్ గర్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు. జిల్లా యంత్రాంగం కృషి వల్లనే ఎక్కువ కేసులు నమోదు కాలేదని, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది ,మున్సిపల్ ,ఇతర శాఖల అధికారులు అందరూ సమిష్టి కృషి చేస్తున్నారని అన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలలో పైరాత్రియం పిచికారి చేయాలని, ఇందుకుగాను సోమవారం నుండి ఏ ఎన్ ఎం లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కలెక్టర్ కు వివరించారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సబ్ సెంటర్ కు ఒకటి చొప్పున పైరాత్రియం పిచికారీ చేసే ఫ్లిప్ పంపులను ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రికి వస్తున్న ఇన్ పేషెంట్లు ,ఔట్ పేషెంట్లు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటిండెంట్ డాక్టర్ రామ్ కిషన్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహారావు, ఆర్ఎంపీ డాక్టర్ వకుళ, డాక్టర్ అమరావతి, డాక్టర్ శ్రీకాంత్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అసోసియేషన్ డాక్టర్ నావేల్ కిషోర్ తదితరులు ఉన్నారు.

Share This Post