స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ప్రజల మనిషిగా, ప్రజాకవిగా పేరుగాంచిన కాలోజి నారాయణరావు సేవలు మరువలేనివని అన్నారు .
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామరావు మాట్లాడుతూ తాడిత, పీడిత జనాల పక్షాన నిలిచి ప్రజలలో రాజకీయ ,సాంఘిక చైతన్యం కలిగించిన మహా కవి కాళోజీ నారాయణరావు అని అన్నారు. కాళోజీ నారాయణరావు తన జీవితం మొత్తాన్ని తెలంగాణ కి అంకితం చేశారని, బతుకంతా తెలంగాణ కు ఇచ్చిన వ్యక్తి అని కొనియాడారు. “పుట్టుక నీది ,చావు నీది, బ్రతుకు మాత్రం దేశానిది” అన్న గొప్ప మనిషి అని అన్నారు.
జిల్లా పరిషత్ సీఈవో జ్యోతి,డిపిఆర్ ఓ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ప్రేమ్ రాజ్ తదితరులు కాళోజీ నారాయణ రావుకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.