MBNR – ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో మరో అదనపు కలెక్టర్ కే. సీతారామ రావు తో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ముందుగా ఆయన వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.
ప్రజావాణి ఫిర్యాదులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను వారంరోజుల్లో పరిష్కరించాలని చెప్పారు. మండల స్థాయిలో అధికారులు అక్కడికక్కడే పరిష్కరిస్తే ఫిర్యాదులు జిల్లా స్థాయికి రావని అన్నారు. అంతేకాక ఫిర్యాదులు వారి పరిధిలోనే పరిష్కరించడమే కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా సంబంధిత అధికారుల ద్వారా మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు .తాహసిల్దార్లు, ఎంపీడీవో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన ఆయన ఆదేశించారు.
పొడు భూములకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం లోపు అప్లోడ్ చేయాలని ఆయన తాసిల్దార్ లను ఆదేశించారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మండలాల తహశీల్దార్లు తక్షణమే బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేయాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పార బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున యాసంగి లో రైతులు వరి వేయకుండా ఈ విషయం పై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. వరికి బదులుగా ప్రత్యమన్యాయ పంటలు వేయాలని కోరారు. ప్రత్యేక అధికారులు కూడా ఈ విషయంపై శ్రద్ధ వహించాలని, అదేవిధంగా వానకాలానికి సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న దాన్యం కొనుగోలు కేంద్రాలు పై కూడా దృష్టి సారించాలని కోరారు.
అదేవిధంగా ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్ళినప్పుడు పాఠశాలను,హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల చదువు, భోజనం తదితర అంశాలను కూడా తనిఖీ చేయాలని అన్నారు.
మరో కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నేపధ్యం లో అందరూ అప్రమత్తంగా ఉండాలని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ ను వేగవంతం చేయడం ,ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం,సానిటైజ్ చేయటం వంటివి తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు మాట్లాడుతూ ధరణి దరఖాస్తులు తాహసిల్దార్ స్థాయిలో 133 పెండింగులో ఉన్నాయని, వాటన్నిటినీ పరిష్కరించాలని , అదేవిధంగా పెండింగ్ రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేయాలని కోరారు.
షెడ్యూల్ కార్పొరేషన్ ద్వారా భూమి లేని నీరు పేద ఎస్సీలకు భూమి కొనుగోలు కింద 2014 పూర్వం 900 ఎకరాలు, 2014 తర్వాత 272 ఎకరాలను కొనివ్వటం జరిగిందని, ఈ భూములన్నీ లబ్ధిదారులే సాగు చేసుకునేలా చూడాలని, ఎవరు కూడా ఈ భూములు అమ్మ వద్దని ఆయన కోరారు.
దాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేనప్పుటికీ, ఇకపై కూడా ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని తహశీల్దారులతో కోరారు. ముఖ్యంగా పౌరసరఫరాలకు సంబంధించి తహసీల్దార్లు మండల స్థాయిలో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని రెవిన్యూ అదనపు కలెక్టర్ అన్నారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 57 దరఖాస్తులు వచ్చాయి._జడ్పీ సీఈవో జ్యోతి డి ఆర్ డి ఓ, యాదయ్య, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Post