MBNR – ప్రజావాణి ఫిర్యాదులను వారంలోపు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులను వారంలోపు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరం నుండి మండల స్థాయి అధికారులతో ఆన్లైన్ ప్రజావాణి నిర్వహించిన అనంతరం ప్రజల వద్ద నుండి ప్రత్యక్షంగా ఫిర్యాదులను స్వీకరించారు.
అధికారులు ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని ,ఒకవేళ ఏదైనా ఫిర్యాదు పరిష్కరించకపోతే అందుకు గల కారణాలను వివరాలతో సహా సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫిర్యాదుల కు సంబంధించి సకాలంలో స్పందించకుంటే మెమోలు జారీ చేస్తామని అన్నారు.
తహసిల్దారులు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి స్థాయిలో పూర్తి చేసి తక్షణమే శాసనసభ్యులకు పంపించాలని తెలిపారు.
ధరణి కింద పెండింగ్లో ఉన్న మ్యుటే షనులు, రిజిస్ట్రేషన్లు ఇతర దరఖాస్తులు అన్నింటిని వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.
డి ఆర్ ఓ కే. స్వర్ణలత, జిల్లా అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 61 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది.

Share This Post