MBNR – ప్రజావాణి ఫిర్యాదుల కు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు కోరారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్దనుండి ఫిర్యాదులను స్వీకరించారు.
సోమవారం 73 మంది పిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు,జిల్లా అధికారులకు సమర్పించారు.
ఈ సందర్బంగా కలేక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని,అప్పుడే అవి వెంటనే పరిష్కారం అవుతాయని అన్నారు.
ఆయా శాఖల అధికారులు ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే లబ్ధిదారులకు మేలు కలుగుతుందన్నారు
కాగా సోమవారం వచ్చిన ఫిర్యాదులలో భూములకు సంబంధించిన వి,ఉపాధి,ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించి ఉన్నాయి.

Share This Post