MBNR – ప్రజావాణి రద్దు చేసినప్పటికి ఫిర్యాదులు సమర్పించెదుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పిర్యాదుదారులు

@ ప్రజావాణి రద్దు చేసినప్పటికి ఫిర్యాదులు సమర్పించెదుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పిర్యాదుదారులు
@మధ్యాహ్నం 3 గంటల వరకు ఓపికతో ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.
ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపు లో భాగంగా సిబ్బంది బదలాయింపు నిమిత్తం సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ముందస్తుగానే పత్రికలు,మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేసినప్పటికి సోమవారం అనేకమంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వీరిని చూసిన జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం రద్దు అయినప్పటికీ అందరి దగ్గర నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముఖ్యంగా ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించి పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ఉద్యోగులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతి ఫిర్యాదును తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి వారితో మాట్లాడారు. అనేక మంది ప్రజలు కూడా వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లోనే ఉండి ఓపిగ్గా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుని వారికి సమాధానాలను ఇచ్చారు.

 

 

Share This Post