MBNR – ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు.

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మండల,గ్రామ స్థాయి అధికారులు, ప్రజల సమస్యలను వారి పరిధిలోనే పరిష్కరించడం పై దృష్టి సారిస్తే వారు జిల్లా కేంద్రనికి రానవసరం లేకుండా అక్కడికక్కడే పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ముఖ్యంగా తాహసిల్దార్ లు, ఎంపీడీవోలు ప్రజావాణి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు .సి ఎం జి బి కి సంబంధించి జిల్లా స్థాయిలో కేవలం 3 మాత్రమే పెండింగ్లో ఉండగా, తాహసిల్దార్ల వద్ద 17 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా ప్రజావాణి కి సంబంధించి తాహసిల్దార్ వద్ద 103 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, వాట్సప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు సంబంధించి 23 పెండింగ్ ఉన్నాయని, అందువల్ల వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. వీటితోపాటు ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరిస్తే ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. ఇకపై మండల స్థాయిలోని ప్రజా ఫిర్యాదుల పై నిశిత దృష్టి కేంద్రీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
గ్రామ పంచాయతీలు వైకుంఠ రథం బాడీ ఫ్రీజర్లు కొనుగోలుపై దృష్టి సారించాలని, ఇందుకుగాను అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని లేదా గ్రామపంచాయతీ నిధుల నుండి కొనుగోలు చేయాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు కూడా వీటిని కొనుగోలు చేయాలని చెప్పారు.
తాహసిల్దార్లు ధరణి దరఖాస్తులపై దృష్టి సారించాలని,ఏ రోజు దరఖాస్తులు అదేరోజు పూర్తి చేయాలని చెప్పారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వరదలు ప్రమాదాల వంటివి అత్యవసర పరిస్థితుల్లో మండల స్థాయి అధికారులు తక్షణమే స్పందించాలని , ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా దృష్టిసారించాలని, అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరికి మిషన్ భగీరథ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని , వాగులు వంకలు పొంగిపొర్లుతున్న దృష్ట్యా అందులో ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

కాగా సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు రాగా వాటిలో ఎక్కువ ఫిర్యాదులు భూముల సమస్యలకు సంబందించినవే ఉన్నాయి
స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిఆర్ఓ కె.స్వర్ణలత, ఆర్డిఓ జడ్పీ సీఈవో జ్యోతి , జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post